*చండూర్ డిగ్రీ కళాశాల లో మే 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు*
*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా డిగ్రీ కళాశాల స్థాయిలో మే 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్ కళాశాలల వారోత్సవ బ్రోచర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రణాళికలో భాగంగా అధ్యాపకుల సమావేశం,అవగాహన కార్యక్రమం, యోగ, అభ్యాసన తరగతులు, గ్రంథాలయ పుస్తక వివరణ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై అవగాహన కార్యక్రమం ఏడు రోజుల ప్రణాళికలు ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చండూరు విద్యాధికారి వి సుధాకర్ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు,అధ్యాపకులు బాలసైదులు, జ్యోతి, పద్మజ, వెంకన్న పాల్గొన్నారు.

