📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialప్రజల చెంతకు ‘బాపు’ శుభకార్యాల్లో ఆశీస్సులు.. కష్టాల్లో భరోసా

ప్రజల చెంతకు ‘బాపు’ శుభకార్యాల్లో ఆశీస్సులు.. కష్టాల్లో భరోసా

📰 Generate e-Paper Clip

ప్రజల చెంతకు ‘బాపు’

శుభకార్యాల్లో ఆశీస్సులు.. కష్టాల్లో భరోసా

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్/ఎండపల్లి, మే 10 (ప్రజావాణి):

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు (బాపు) ఆదివారం ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అటు వివాహ వేడుకల్లో పాల్గొని నవదంపతులను ఆశీర్వదిస్తూనే, ఇటు మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. ఎండపల్లి మండలం పాతగూడూర్ వాస్తవ్యులు (క్రీ॥శే॥) ఆనంద్ రావు – పద్మ దంపతుల కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అదే గ్రామంలోని చెరుకూరి అఖిల్ స్వప్న, కోనేటి రమేష్ అంజలి నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. వెల్గటూర్ మండలం చేగ్యం గ్రామంలో ఇటీవల జరిగిన వివాహాలకు హాజరు కాలేకపోవడంతో, నవదంపతులు కోల అశ్విని-సాయి, ఆవుల స్రవంతి-రాఘు నివాసాలకు స్వయంగా వెళ్లి వారిని ఆశీర్వదించారు. కుమ్మరిపల్లిలో కొప్పుల రాకేష్-వైష్ణవి, రాజారాంపల్లిలో గాజుల అరవింద్-సుమశ్రీ, కరీంనగర్ రూరల్ ఎంపీడీవో ఆకుల సంజీవ రావు కుమారుడి వివాహ వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రావుపేట సర్పంచ్ కుమారుడి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. ఎండపల్లి మండల రాజారాంపల్లి గ్రామ సర్పంచ్ సంగ రమేష్ యాదవ్ ఆహ్వానం మేరకు గ్రామంలో పర్యటించిన శ్రీనివాస్ రావు, అక్కడ నిర్మించనున్న శివాలయం, ప్రాథమిక వైద్యశాల కోసం కేటాయించిన స్థలాలను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తగు సూచనలు చేశారు. వెల్గటూర్ మండలం బీర్సాని గ్రామంలో బావిలో పడి మృతి చెందిన కంపెల్లి రితేష్ కుటుంబాన్ని పరామర్శించి  10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. రాజక్కపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుషనపల్లి శ్రీను కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. కుమ్మరిపల్లి గ్రామంలో పకీర్ రాజయ్య కుమార్తె వివాహం కోసం 10 వేల రూపాయల ఆర్థిక  సహాయం చేశారు. కొత్తపల్లి గ్రామంలో మృతి చెందిన జాబు లచ్చన్న కుటుంబానికి  5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల మృతి చెందిన పాతగూడూరుకు చెందిన మహమ్మద్ ఖాజాబీ, సూరారంకు చెందిన జాడి లచ్చయ్య, మారేడుపల్లికి చెందిన జాగేటి రాధ, కుమ్మరిపల్లికి చెందిన జక్కుల చంద్రయ్య,  కిషన్ రావుపేటకు చెందిన పాత్రికేయులు పులి లక్ష్మణ్ తండ్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సామాన్య ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న శ్రీనివాస్ రావు పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు చాటుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.