*దేశవ్యాప్తంగా ఘనంగా జాతీయ సాంకేతిక దినోత్సవం*
*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
పోఖ్రాన్ అణుపరీక్షల విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 11న జరుపుకునే జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. 1998 మే 11 న భారత్ పోఖ్రాన్‌లో ‘ఆపరేషన్ శక్తి’ పేరుతో విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించబడ్డాయి. అదే రోజు దేశీయంగా తయారైన ‘హంస-3’ విమానం, ‘త్రిశూల్’ క్షిపణి పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. ఈ మూడు విజయాలకు గుర్తుగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మే 11న ‘నేషనల్ టెక్నాలజీ డే’గా ప్రకటించారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, సైన్స్ సెంటర్లలో విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్లు, క్విజ్ పోటీలు జరిగాయి. “సాంకేతికతే అభివృద్ధికి మూలం. భారత్ టెక్నాలజీలో సూపర్ పవర్ ఎదగాలి” అని శాస్త్రవేత్తలు.


