పాపయ్యపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర
* హనుమాన్ మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
* సందర్భంగా రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది
జమ్మికుంట మే 8 ప్రజావాణి
జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్రను గ్రామంలోని పురవీధులగుండ ఊరేగించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ శోభాయాత్రనునిర్వహించారు. శ్రీ అభయాంజనేయ ఉత్సవమూర్తికి వివిధ రకాల పూలతో ఘనంగా అలంకరించి వాహనంపై అధిరోహించారు.అనంతరం గ్రామంలోని పురవీధులగుండ స్వామివారిని ఊరేగించారు. హనుమాన్ మాలధారణ స్వాములతో పాటు మహిళలు డప్పు చప్పుళ్ళు,మేళా తలలతో కోలాట నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు. గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమాన్ రథయాత్రను అధ్యాయం తో రథయాత్రను తిలకించారు.గ్రామ ప్రజలు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలోగురు స్వాములు గుండెకారి మధు,శంకర్,తోపాటు మాలాధారణ స్వాములు వజ్జపళ్లి రాజు,కొల్లూరి రాకేష్,ఆరేపల్లి శివకృష్ణ,పవన్ కుమార్ మహేందర్,రాములు,సంతోష్,నరేష్,మనోహర్ స్వాములు ఉన్నారు

