📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న చలివేంద్రం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న చలివేంద్రం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, మే 8(ప్రజావాణి): వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్కేసర్ ఆధ్వర్యంలో బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రం విజయవంతంగా ఒక నెల పూర్తి చేసుకుంది. స్థానిక ప్రజలకు చల్లని తాగునీరు అందిస్తూ ఈ చలివేంద్రం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

ఈ కార్యక్రమాన్ని లయన్ బోగా శ్రీలక్ష్మి హరినాథ్ మరియు లయన్ ఉడుత హిమబిందు నవీన్ సంయుక్తంగా నిర్వహిస్తూ సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్న వారిని స్థానికులు అభినందిస్తున్నారు.

సమాజ సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయని పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.