📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భార్య పుట్టింట్లో బంగారు ఆభరణాల చోరీ కి పాల్పడిన భర్త అరెస్ట్

భార్య పుట్టింట్లో బంగారు ఆభరణాల చోరీ కి పాల్పడిన భర్త అరెస్ట్

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) పోలీస్.భార్య పుట్టింట్లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన భర్త అరెస్ట్ రూ.9 లక్షల విలువైన బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం,మద్యం,జూదం వంటి చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తి చోరీకి పాల్పడిన ఘటన.కుటుంబ కలహాల కారణంగా పుట్టింట్లో ఉంటున్న భార్య ఇంట్లో చోరీ.గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ IPS ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన ఛేదించిన చేబ్రోలు పోలీసులు.చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేజెండ్ల గ్రామానికి చెందిన సాతర్ల తిరుపతమ్మ (33 సంవత్సరాలు)తన ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి మెయిన్ డోర్ తెరిచి ఇనుప బీరువా తాళాలు పగులగొట్టి సుమారు రూ.9,00,000/-విలువైన 72 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు కొన్ని వెండి ఆభరణాలు దొంగిలించారని ఫిర్యాదు చేశారు.దీనిపై చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీ వీరనారాయణ Cr.No.93/2026,U/s 331(4)305(a) BNS ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కేసు దర్యాప్తులో భాగంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెనాలి డీఎస్పీ శ్రీ జనార్ధన్ రావు పర్యవేక్షణలో,పొన్నూరు రూరల్ సర్కిల్ సీఐ శ్రీ కృష్ణయ్య, చేబ్రోలు ఎస్సై శ్రీ వీరనారాయణ,మరియు సిబ్బంది కలిసి కొత్తరెడ్డిపాలెం సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక అనుమానిత వ్యక్తి పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా,వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు.విచారణలో సదరు వ్యక్తి ఫిర్యాదిదారురాలి భర్త సాతర్ల గోపి (36 సంవత్సరాలు)తండ్రి రాఘవులు,గుండవరం గ్రామ నివాసి అని తేలింది.కుటుంబ విభేదాల కారణంగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారని,భార్య తన తల్లి ఇంటి వద్ద వేజెండ్ల గ్రామంలో నివసిస్తోందని విచారణలో వెల్లడైంది.నిందితుడు మద్యం సేవించడం,పేకాట వంటి చెడు వ్యసనాలకు బానిసై డబ్బుల అవసరం ఏర్పడటంతో తన అత్తగారింట్లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు.నిందితుడి ఒప్పుకోలు మేరకు అతని వద్ద నుండి దొంగిలించబడిన బంగారు మరియు వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసిన ఆభరణాలు FIRలో పేర్కొన్న వివరాలకు సరిపోలినవి. స్వాధీనం చేసిన వస్తువులు:బంగారు హారం సుమారు 3.5 సవర్లు బంగారు నెక్లెస్  సుమారు 24 సవర్లు బంగారు చైన్ సుమారు 2 సవర్ల లోపు వెండి కాళ్ల పట్టీలు  ఒక జత నిందితుడిని ఈ రోజు (07.05.2026) మధ్యాహ్నం సుమారు 2.00 గంటలకు అరెస్ట్ చేసి,అరెస్ట్ కారణాలు తెలియజేసి గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగింది.ఈ కేసును వేగవంతంగా ఛేదించి,దొంగిలించబడిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పొన్నూరు రూరల్ సర్కిల్ సీఐ శ్రీ కృష్ణయ్య,చేబ్రోలు ఎస్సై శ్రీ వీరనారాయణ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ IPS అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.