📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్ రైల్వే వంతెన నిధుల మంజూరుపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ఘట్కేసర్ రైల్వే వంతెన నిధుల మంజూరుపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, మే 7(ప్రజావాణి): ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎం ఎం సి ఘట్కేసర్ డివిజన్ పరిధిలో మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఇంచార్జి తోటకూర వజ్రస్ యాదవ్ ఆదేశాల మేరకు ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ ప్రితం నగరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ, ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో ఏర్పడిన జాప్యం, కాంట్రాక్టర్‌కు రావాల్సిన నిధుల విషయాన్ని డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రస్ యాదవ్, ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారని తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 17 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే వంతెన పనుల కారణంగా ఘట్కేసర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎంతో ఓర్పుతో ఎదురుచూసిన ఈ సమస్య పరిష్కార దిశగా అడుగులు పడటం సంతోషకరమన్నారు.

డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రస్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్నప్పటికీ జ్వరంతో బాధపడుతున్న కారణంగా రాలేకపోయారని తెలిపారు. వంతెన నిర్మాణానికి సహకరించిన యువజన సంఘాలు, జేఏసీ నాయకులు, మహిళలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, మాజీ సర్పంచ్ డక్కి రమేష్, కీసరగుట్ట ఆలయ డైరెక్టర్ సగ్గు అనిత, అమర్, కొమురవెల్లి ఆలయ ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మాజీ డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, మేకల దాసు, జేఏసీ నాయకులు ప్రమోద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్, ఉపాధ్యక్షులు నాగరాజు, ప్రభాకర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఉపాధ్యక్షులు రఫిక్, మాజీ వార్డు సభ్యులు వెంకట్ నారాయణ, నర్సింగ్ రావు, సీనియర్ నాయకులు ఖయ్యూం, విజయ్, మడిపడిగే శంకర్, రామకృష్ణ, కడుపొల్ల రాజు, తోక రాజు, బాల్ రాజు, సత్తి రెడ్డి, సిరాజ్, బాబు, ఆశ్రఫ్, సల్మాన్ రాజ్, ప్రవీణ్, ఫాయుమ్, సాయి యాదవ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.