📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్శాంతినగర్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం గోదాంపై అధికారులు దాడి

శాంతినగర్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం గోదాంపై అధికారులు దాడి

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) కొండపల్లి శాంతినగర్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం గోదాంపై అధికారులు దాడి నిర్వహించారు ఇబ్రహీంపట్నం పోలీసులు,రెవెన్యూ శాఖ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నారు.శాంతినగర్‌లోని అభినందన ఫ్లాట్స్‌లో సుమారు 600 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం పీడీఎస్ ఎస్ డీటీ రామకృష్ణ మాట్లాడుతూ,స్వాధీనం చేసుకున్న బియ్యం నిల్వలపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని తెలిపారుఈ కేసులో అక్రమ రవాణాకు సంబంధించి డేరంగుల గోపిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.