📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రైవేట్ హాస్పటల యాజమాన్యం వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తూ ఒక సామాన్యుడు వైద్యం చేపించుకోలేని పరిస్థితి.. ప్రైవేట్...

ప్రైవేట్ హాస్పటల యాజమాన్యం వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తూ ఒక సామాన్యుడు వైద్యం చేపించుకోలేని పరిస్థితి.. ప్రైవేట్ హాస్పిటల్స్ ల దోపిడి..

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) నందిగామ ప్రాంతంలో ఉన్న  ప్రైవేట్ హాస్పటల యాజమాన్యం వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తూ ఒక సామాన్యుడు వైద్యం చేపించుకోలేని పరిస్థితి.ప్రైవేట్ హాస్పిటల్స్ ల దోపిడి. ప్రైవేట్ వైద్యశాలలో వాటిపై అధికారుల నియంత్రణ కొరవడింది కారణం.ప్రతి వైద్యశాలని తనిఖీ చేయాల్సింది ఉండగా చాటుమాటుగా తనిఖీ చేసినట్టు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం సాగిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు.ఒక రోగికి రోగం ఒకటి పది రక్త పరీక్షలు.అదేమిటని అడగగా అన్ని టెస్ట్లు చేస్తేనే రోగనిర్ధారణ తెలుస్తుందని వైద్యులు అంటున్నట్టు రోగులు వాపోతున్నారు.రోగి రోగం వచ్చి హాస్పిటల్ కి వెళితే రోగాన్ని తగ్గించకుండా రోగాన్ని మొదట పెంచి తరువాత తగ్గించి సొమ్ము చేసుకుంటున్నా హాస్పటల్ యజమాన్యం.ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం రక్త పరీక్షా కేంద్రాల యాజమాన్యం,స్కానింగ్ సెంటర్ల యాజమాన్యం,కుమ్మక్కై రోగుల రక్తాన్ని పీల్చుకు తాగుతున్న వైనం. రక్త పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేటు కాకుండా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని రోగులు వాపోతున్నారు.ప్రైవేట్ హాస్పిటల్స్ లో రక్తపరీక్ష కేంద్రాలలో,స్కానింగ్ సెంటర్లలో సౌకర్యాలు నిల్లు దోపిడీ ఫుల్లు.ఇంత జరుగుతున్న నందిగామ ప్రాంతంలో ‘డి ఎం హెచ్ ఓ‘అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది నందిగామ ప్రాంతంలో ఇంతవరకు హాస్పిటల్స్ ను వైద్య జిల్లా అధికారి తనిఖీ చేసిన దాఖలు లేవు.ఇప్పటికైనా జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి నందిగామ ప్రాంతంలో విస్తృత తనిఖీ నిర్వహించి రోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular