📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetఅంతర్జాతీయ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి......

అంతర్జాతీయ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి……

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి……

ప్రజావాణి మే 01:మోతే మండలం, మామిళ్ళగూడెం గ్రామంలో సర్పంచ్ కొరివి నాగమణి వీరాస్వామి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వారు మాట్లాడుతూ మే డే అనేది  అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని గుర్తు చేసినారు.

ఇట్టి కార్యక్రమంలో మామిళ్ళగూడెం సీనియర్ నాయకులు నవిలే రామకోటయ్య గారు మాట్లాడుతూ మే డే అనేది 1896 మే 1న అమెరికా లోని షికాగో లో కార్మికుల పని గంటలను 8 గంటలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జరిగిన “హే మార్కెట్” ఉద్యమం ,అందులో చనిపోయిన కార్మికుల స్మారకార్ధం ఈ రోజు ను పాటి స్తారు అని గుర్తు చేశారు.ఇట్టి కార్యక్రమంలో వార్డు మెంబర్లు గంగరాజు,వెంకన్న, దడ వాయిలు నవిలే వీరాస్వామి,వెంకన్న మరియు మామిళ్ళగూడెం గ్రామ కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular