📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialపదో తరగతిలో సత్తా చాటిన అనుప్రియ, సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు చెన్న కుమార స్వామి

పదో తరగతిలో సత్తా చాటిన అనుప్రియ, సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు చెన్న కుమార స్వామి

📰 Generate e-Paper Clip

పదో తరగతిలో సత్తా చాటిన అనుప్రియ

ఘనంగా సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు చెన్న కుమార స్వామి

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 30 (ప్రజావాణి):

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల అనుప్రియ అద్భుత ప్రతిభ కనబరిచింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో ఆమె 580 మార్కులు సాధించి తన గ్రామానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా గురువారం రోజున అనుప్రియను ఉమ్మడి వెల్గటూర్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చెన్న కుమార స్వామి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకుని కుమార స్వామి ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అనుప్రియ తన కష్టంతో మంచి మార్కులు సాధించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇదే పట్టుదలతో చదువును కొనసాగిస్తూ, రానున్న రోజుల్లో ఉన్నత చదువులు అభ్యసించి మరింత విద్యాభివృద్ధిని సాధించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular