పదో తరగతిలో సత్తా చాటిన అనుప్రియ, సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు చెన్న కుమార స్వామి
పదో తరగతిలో సత్తా చాటిన అనుప్రియ ఘనంగా సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు చెన్న కుమార స్వామి జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 30 (ప్రజావాణి): పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల అనుప్రియ అద్భుత ప్రతిభ కనబరిచింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో ఆమె 580 మార్కులు సాధించి తన గ్రామానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా గురువారం రోజున అనుప్రియను ఉమ్మడి వెల్గటూర్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు...