📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఒంటెద్దు నరసింహారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోప్పుల జైపాల్ రెడ్డి

ఒంటెద్దు నరసింహారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోప్పుల జైపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఒంటెద్దు నరసింహారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు .
: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోప్పుల జైపాల్ రెడ్డి

మునగాల, ఏప్రిల్ 29, ప్రజావాణి.
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్  రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి వ్యాఖ్యలను మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో  హుజూర్నగర్ ,కోదాడ  నియోజకవర్గాల అభివృద్ధిని , కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో పెరుగుతున్న ప్రజాధరణని చూసి ఓరువలేక  మతిభ్రమించి బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నలమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేయటం సిగ్గుచేటని ఆయన అన్నారు. మంత్రి ప్రమాద ఉత్తంకుమార్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తక్షణమే క్షమాపణ చెప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాసర్ల శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి  జిల్లేపల్లి వెంకటేశ్వర్లు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల శ్రీనివాస్ , బిట్టు వెంకటేశ్వర్లు ,బిట్టు లింగయ్య ,కోట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.