📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మలేరియా రహిత సమాజమే మన లక్ష్యం:కమిషనర్, శ్రీ అలీమ్ భాష

మలేరియా రహిత సమాజమే మన లక్ష్యం:కమిషనర్, శ్రీ అలీమ్ భాష

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్25) మంగళగిరి తాడేపల్లి ప్రపంచ మలేరియా దినోత్సవం ఈ కార్యక్రమము మంగళగిరిలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నుండి ర్యాలీ తోటి నిర్వహించడం జరిగింది రాబోయే వర్షాకాలం దోమల ద్వారా వ్యాపించే మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను అప్రమత్తం చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తారీకు ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మలేరియా అని పూర్తిగా తుద ముట్టించటం, జ్వరం వచ్చిన వెంటనే మెడికల్ షాపుల్లో మందులు తెచ్చుకోకుండా దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలలో తగిన రక్త పరీక్షలు చేయించుకుని జ్వర నిర్ధారణ చేయించుకుని డాక్టర్ సూచించిన మందులను మాత్రమే వాడుకొని ప్రాణాలను కాపాడుకొనవలెను అలాగే మన ఇంట్లో మరియు ఇంటి చుట్టూ నీరు నిలవకుండా చేసుకొనటం ద్వారా దోమల పెంపకాలని అరికట్టవచ్చు,అలాగే ఇంటింటికి వచ్చేటటువంటి నర్సు, మరియు మలేరియా సిబ్బంది వద్ద కూడా రక్త పరీక్ష పరికరాలు ఉంటాయి,జ్వరం వచ్చినప్పుడు వారి వద్ద కూడా రక్త పరీక్ష చేయించుకొని తగు మందులు ఉచితంగా పొంది ఆరోగ్యాన్ని కాపాడుకొనవలెనని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ప్రజారోగ్య పరిరక్షణకు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ మరియు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ప్రజారోగ్య సంరక్షణకు మేము నిర్వహించే అన్ని కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకరిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడటానికి వారి వంతు కృషి కూడా అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్, శ్రీ అలీమ్ భాష,మరియు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీమతి తమ్మిశెట్టి జానకి గారు మరియు మంగళగిరి పట్టణ బిజెపి అధ్యక్షుడు శ్రీ మునగాల నాగేశ్వరరావు, వైద్య అధికారులు, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ మరియు ఆరోగ్య సిబ్బంది మలేరియా సిబ్బంది పాల్గొన్నారు,మలేరియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మంగళగిరి పురవీధులలో ర్యాలీ నిర్వహించడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular