📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రధాని మోడీ పై కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించిన బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ ,,సుప్రజ

ప్రధాని మోడీ పై కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించిన బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ ,,సుప్రజ

📰 Generate e-Paper Clip

 

ప్రపంచ ప్రజల అభిమానాలను చూరగొన్న ప్రధాని మోడీపై కాంగ్రెస్ నాయకులు చేసే వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయని సుప్రజ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని ఇష్టమొచ్చిన రీతిలో దూషించడం కాంగ్రెస్ నాయకుల మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, త్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామాలయ సమస్య పరిష్కారం ఒంటి దేశ సమస్యల పరిష్కారానికి ఆయన ఒక దిక్సూచి అని అటువంటి రాజనీతిజ్ఞన్ని మల్లికార్జున ఖర్గేను ముందు పెట్టి కాంగ్రెస్ నాయకుల దుర్మార్గపు ఆలోచనలను ఆయన నోటి గుండా చెప్పించడం క్షమించరాని విషయమని, దేశ ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ప్రధానిపై విమర్శలు చేసే సందర్భంలో హుందాతనాన్ని ప్రదర్శించాలని ఆమె సలహా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.