📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెట్రోల్, డీజిల్ కొరతను చూపించి రేట్లు పెంచాలన్న ఆలోచన విరమించుకోవాలి సిపిఐ డిమాండ్ .

పెట్రోల్, డీజిల్ కొరతను చూపించి రేట్లు పెంచాలన్న ఆలోచన విరమించుకోవాలి సిపిఐ డిమాండ్ .

📰 Generate e-Paper Clip

                                ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) బద్వేల్                                              పెట్రోల్,డీజిల్ బ్లాక్ మార్కెట్ మాఫియా అరికట్టాలి సిపిఐ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్,పెట్రోలు గ్యాస్ కొరత ఉన్నదని బూచిగా చూపించి రేట్లు పెంచి ప్రజలపై భారం మోపాలన్న ఆలోచన ను విరమించుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీర శేఖర్,ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ లు పాలక ప్రభుత్వాలపై మండిపడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం స్థానిక జెవి భవనం నందు విలేకరుల సమావేశంలో రెండు దేశాల యుద్ధం జరిగిన సందర్భంగా పెట్రోల్,డీజిల్ వంట గ్యాస్ లేకుంటే లేదని చెప్పాలి,ఉంటే తక్కువ లేకుండా ఇవ్వాలి. కొరత రూపంలో ప్రజల పైన పెనుబారం మోపేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న దోబూజులాటను ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. డీజిల్ కొరత వలన,ట్రాన్స్ ఫోర్ట్ వ్యవస్థ రోజుకు వాహనాలు ఇంటిదగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది ఈ విధంగా అయితే ఏ విధంగా ఫైనాన్సుల కంతులు కట్టాలనో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఆటో,టాక్సీ,కారు జీపు,మినీ లారీ,ఆల్ వ్యాన్ లారీల వంటి వాహనాలు ఫైనాన్స్ వాళ్లకు అప్ప చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది దీనిపైన కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దేశ ప్రజల కోసం పనిచేసే పాలక ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు.పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే,గతంలో మేము నెలకు ఎన్ని ట్యాంకర్ అమ్మగలిగితే అన్ని ట్యాంకర్లు సగం మాత్రమే ఇస్తాము మీరు డీడీలు కట్టిన ఉపయోగం లేదని తేల్చి చెప్పడం ఒక ఎత్తైతే, డీజిల్ పెట్రోల్ లేదు అని పెట్రోల్ పంపు వద్ద బోర్డు పెట్టుకొని రాత్రి సమయంలో అదనపు రేట్లతో బ్లాక్ మార్క్ అమ్ముకోవడం మరొక వ్యక్తి అయింది.ప్రతినిత్యం రోడ్డు మీద బ్రతికే వాళ్ళు,ఐస్ లు అమ్ముకునే వాళ్ళు,చిరు వ్యాపారస్తులైన,బైకులు,ఆటోలు,ప్రతిరోజు జనం బారులు తీరి ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని ఐఓసీ అధికారులు,అలాగే రాత్రి సమయంలో బస్సులు మిస్సై ఆటోలో వెళ్లాలంటే మాకు డీజిల్ లేదు,లేకపోతే అదనపుగా వందల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్న ఐఓసీ డీలర్లపై చర్యలు తీసుకొని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి పెట్రోల్ డీజిల్ తీసుకురాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు,ఏరియా సహాయ కార్యదర్శి ఇమ్మానియేల్,కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ,నాగరాజు,జి ఎల్ నరసింహ,నాగేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.