📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్తెనాలి తాహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

తెనాలి తాహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్21) జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మంగళవారం తెనాలి తాహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. తాహసిల్దార్ గోపాలకృష్ణ కార్యాలయ పునరుద్ధరణ పనులను వివరించారు. కార్యాలయం చక్కగా తీర్చిదిద్దినందుకు తాహసిల్దార్ ను అభినందించారు. మంచి కార్యాలయం ఉండటం వలన విధుల నిర్వహణ ఆహ్లాదకర వాతావరణంలో చేయవచ్చని అన్నారు.అనంతరం తెనాలి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. తెనాలి ప్రాంతంలో జరిగే గృహ నిర్మాణ పనులు ఇతర అభివృద్ధి పనులను గురించి తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ్ అప్పలనాయుడు, గృహ నిర్మాణ సంస్థ ఇన్చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ తో చర్చించారు. గృహ నిర్మాణాలు వేగవంతంగా చేయుటకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పేదలకు సొంత ఇంటి కల అపురూపమని దాన్ని నిజం చేయాలని అన్నారు. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులపై శనివారం ఒక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.