📄 ePaper
Tuesday, April 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కత్తులు,హత్యలు,రక్తపు మరకలతో అట్టుడికి ప్రజలు వణికిపోయిన ఆ పోలీసు సర్కిల్ లో ఓ CI ఎంట్రీ

కత్తులు,హత్యలు,రక్తపు మరకలతో అట్టుడికి ప్రజలు వణికిపోయిన ఆ పోలీసు సర్కిల్ లో ఓ CI ఎంట్రీ

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) వేదాయపాలెం లో నాడు కత్తులు రూలింగ్ నేడు ఖాకీ కంట్రోలింగ.ఏడాదిలో ఎంత మార్పు.ఎందరికో కావలి కనువిప్పు,CI శ్రీనివాసరావు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకుని ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వేదాయపాలెం లో లా & ఆర్డర్ అమలు చేయడం లో విజయవంతం గా ముందుకు సాగుతూ నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతూ కరుడుగట్టిన వేదాయపాలెం సర్కిల్ నేర సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేసి అత్యంత శాంతియుత రక్షణ వలయంగా మార్చిన CI శ్రీనివాసరావు కు పూర్తి సహకారం అందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి,డ్యూటీ లో పూర్తి స్వేచ్ఛనిచ్చిన నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వాజెండ్ల కు,నగర DSP దీక్ష కు వేదాయపాలెం సర్కిల్ ప్రజలు కృతజ్ఞత లు తెలుపుతున్నారు.5వ నగర పోలీసు సర్కిల్ లో 4వ సింహం సంచారం తో క్రూర (మానవ)మృగాలు పరార్ .రక్తం ఏరులై పారిన చోట లా&ఆర్డర్ కనుమరుగైన చోట CI శ్రీనివాసరావు ఎంట్రీ తో సీన్ మొత్తం రివర్స్ మూడు హత్యలు ఆరు నేరాలు అన్నట్లు కరుడుగట్టిన నేరగాళ్ళ సామ్రాజ్యంగా కళకళలాడి ప్రజలకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన వేదాయపాలెం పోలీసు సర్కిల్ 2024 ఏప్రిల్ నుండి 2025 మే నెల మధ్య ఏడాదిలో సుమారు 15 నుండి 18 కు పైగా అత్యంత కిరాతకంగా హత్యలు,వందల నేరాలు,కేవలం మూడు నెలల వ్యవధిలో 6 హత్యలు తో గజ గజ వణికిపోయిన వేదాయపాలెం పోలీసు సర్కిల్ లో ఏడాదిగా హత్య అనేది జరగకుండా చూసిన పోలీసులు పోలీసు టీం నుసమర్థవంతంగా ఉపయోగించుకుంటూ లీడర్ లక్షణాలతో నేరాలకు చెక్ పెట్టిన CI శ్రీనివాసరావు,బీవీ నగర లో కరెంట్ ఆఫీసు సెంటర్ లో శ్రీరామ్ క్యాంటీన్ పేరుతో హోటల్ నడుపుకునే భార్యా, భర్త లను ఇంటిలోనే తలలు పగల గొట్టి కిరాతకంగా హత్య..పొదలకూరు రోడ్డు(డైకాస్ రోడ్డు)లో వైన్ షాపు వద్ద చిన్న వివాదానికి బేల్దారి మేస్త్రీ నీ,కూలీ నీ ఇద్దరిని కత్తితో పొడిచి చంపిన ఆటో డ్రైవర్ బావిలో శవాలై తేలిన ఇద్దరు ఇలా అనేక డబుల్ మర్డర్స్ కొండాయ పాలెం చర్చి సమీపం లో తరిమి తరిమి యువకుడు హత్య,పొదలకూరు రోడ్డులో ప్రభుత్వ పాఠశాల వద్ద యువకుడు హత్య అయ్యప్ప గుడి వద్ద చిన్న వివాదానికి నడి రోడ్డు పై టెంపో యాజమాని హత్య లు పబ్లిక్ పట్టపగలు జరగడం తో ప్రజలు బయట తిరగాలంటే గజ గజ వణికిపోయారు ఓ రౌడీ షీటర్ హత్య తర్వాత అతని అంతిమయాత్రలో వందలాదిగా నేరగాళ్లు పాల్గొని మా వాడిని చంపిన వాళ్ళను అడ్డంగా నరికేస్తాం అంటూ పబ్లిక్ లో ప్రతిజ్ఞ చేయడం చూస్తే నెల్లూరు లో ఎలా బ్రతకాలి అని భయపడిన సగటు సామాన్య ప్రజలకు అప్పుడే కొత్తగా వచ్చిన CI శ్రీనివాసరావు,పోలీసు టీం మరో హత్యగాని నేరం గాని జరగకుండా చూశాడు అంటే ఎంత సమర్ధవంతంగా పోలీసింగ్ చేసివుండాలి సర్కిల్ పరిధిలో సుమారు 200వందల మంది రౌడీ షీటర్లు,150 కి పైగా సస్పెక్ట్ షీటర్లు,పదుల సంఖ్యలో ట్రబుల్ మాంగర్స్,హ్యాబెక్ట్సువల్ అఫెండర్స్,గంజాయి సరఫరా దారులు,అమ్మకం దారులు ఇలా ఎన్నో రకాల చట్ట వ్యతిరేక శక్తులు పై నిరంతరం నిఘా,పోలీసు కౌన్సిలింగ్, కఠిన వైఖరి తో ఎంతో మంది నేరాలు వదిలేయగా కొందరు ఈ ప్రాంతాన్నే వదిలి వెళ్లిపోయారు అని CI శ్రీనివాసరావు ఎంత హార్డ్ వర్క్ ఫీల్డ్ వర్క్ చేసివుంటారో ఒకప్పుడు వేదాయపాలెం పోలీసు స్టేషన్ వద్ద నిత్యం పిర్యాదులతో జాతరలాగా ఉండేది,CI శ్రీనివాసరావు వచ్చాక నేడు ఎంతో ప్రశాంతంగా స్టేషన్ ఎప్పుడూ ఖాళీగా కనిపిస్తుంది,ఎవరైనా పిర్యాదిదారులు వచ్చినా వారిని స్టేషన్ చుట్టూ తిప్పుకోకుండా వీలున్నంత తొందరగా సమస్య పరిష్కారం అన్యాయానికి రెడ్ కార్డు.. న్యాయానికి గ్రీన్ కార్డు తో ప్రజల్లో మంచిపేరు పెద్ద మనుషులు,రాజకీయ నాయకుల ముసుగు లో స్టేషన్ కు వచ్చే దళారీలకు డోర్స్ క్లోజ్ మొండి నేరస్తులకు,మోరట పోలీసు.కరుడుగట్టిన నేరగాళ్లకు,కఠిన మైన పోలీసు.కత్తులు పట్టిన ముఠాలకు,లాఠీకి కారంపూసి పెట్టే పోలీసు.గంజాయు,మత్తు బ్యాచ్ లకు,తొక్కిపెట్టి తోలు తీసే పోలీసు.పోలీసు శాఖలోనే మొండోడు అనే పేరుతో ముద్దుగా పిలుచుకునే CI శ్రీనివాసరావు విధుల్లో రాజీలేని పోలీసుగా పేరు వేదాయపాలెం సర్కిల్ లో భయానక పరిస్థితులు నుండి ఏడాదిలో సాధారణ పరిస్థితులు నెలకొల్పిన CI శ్రీనివాసరావునెల్లూరు నగరం లోని 5వ పట్టణ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఒకానొక సందర్భం లో రాష్ట్రం లోనే ఎక్కువ హత్యలు, నేరాలు జరిగిన పోలీసు స్టేషన్ గా చెడ్డపేరు తెచ్చుకుంది, పొదలకూరు రోడ్డు,డైకాస్ రోడ్డు,బీవీ నగర్,ఆటోనగర్, అయ్యప్పగుడి సెంటర్,వేదాయపాలెం,గాంధీ రోడ్డు, నిప్పో సెంటర్,బుజబుజ నెల్లూరు లాంటి ఇంకొన్ని అతిపెద్ద ఏరియాలతో అనేక సమస్యాత్మక ప్రాంతాలతో అతిపెద్ద సర్కిల్ గా ఉంటూ అదే స్థాయిలో అత్యంత ఘోర నేరాలకు అడ్డాగా,సమస్యాత్మక పోలీసు సర్కిల్ గా కత్తులు తో హాల్ చల్ చేసే పోకిరీలు,విచ్చలవిడిగా లభించే గంజాయి,కాంట్రాక్ట్ కిల్లర్స్ కు షెల్టర్ జోన్ గా,రౌడీ గ్యాంగ్ లకు కేరాఫ్ గా,అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా,చట్ట వ్యతిరేకులకు అత్యంత సేఫ్ ప్లేస్ గా,అసాంఘిక కార్యకలాపాలు చేసే వారికి అనుకూల ప్రదేశంగా పేరుపొందిన వేదాయపాలెం పోలీసు సర్కిల్ అతి పెద్ద నేర సామ్రాజ్యం గా మారిపోయి ఇటు పోలీసులకు అటు వ్యవస్థలకు సవాలుగా మారిపోయిన పరిస్థితుల్లో ఓ సాధారణ పోలీసు అధికారి గా 2025 మే నెలలో వేదాయపాలెం పోలీసు స్టేషన్ లో ఛార్జ్ తీసుకుని తక్కువ కాలం లోనే సర్కిల్ పరిధిలో జరుగుతున్న నేర పరిస్థితులు, ప్రదేశం పై పూర్తి అవగాహన తెచ్చుకుని మొదట తన పోలీసు స్టేషన్ నుండే ప్రక్షాళన మొదలు పెట్టిన CI శ్రీనివాసరావు తన మార్కు పోలీసింగ్ చూపించడం మొదలు పెట్టాడు,అప్పటికే(2025 ఏప్రిల్ నాటికి) నెల్లూరు నగరం లోని మొత్తం 6 నగర పోలీసు సర్కిల్స్,రూరల్ పోలీసు సర్కిల్స్ లో ఎక్కడ చూసినా హత్యలు,నేరాలు కత్తులతో హల్చల్ చేసే గ్యాంగ్ లు గంజాయి బ్యాచ్ లతో నెల్లూరు నగరం వణికిపోతుంది,ఎవడు ఎవడిని ఎందుకు పొడిచేస్తాడో,ఎవడు ఎవడిని ఎందుకు నరికేస్తాడో అని సామాన్య ప్రజలు బయట తిరిగేందుకు భయపడి పోతున్న పరిస్థితి లో మొదట నేరాలు అదుపుచేయాలంటే నేర మూలాలు పై దెబ్బ కొట్టాలి అని గ్రహించిన CI శ్రీనివాసరావు మూలాలు అదుపుచేయాలంటే పోలీసులు స్టేషన్ లో కూర్చుంటే సరిపోదని స్వయంగా రోడ్లపైకి వచ్చి డ్యూటీలు చేయాలని సిబ్బందితో సహా రోడ్లపైకి వచ్చి నిత్యం తన పోలీసు సర్కిల్ లో యువకుల వాహనాలు తనిఖీ చేయడం,డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం,కత్తులతో పట్టుబడితే తన స్టైల్ లో స్టేషన్ కు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం,పాత నేరగాళ్లు, రౌడీ షీటర్ల ను ప్రతి ఆదివారం స్టేషన్ కు పిలిచి స్వయంగా తానే కౌన్సిలింగ్ ఇవ్వడం,నేరగాళ్ల పై నిత్యం ఓ కన్నేసి ఉంచడం ముక్యంగా నేరగాళ్ల లిస్ట్ రెడీ చేసి వారిలో అత్యంత ప్రమాదకారులు,అవసరాన్ని బట్టి నేరాలు చేసే వారు,గ్రూప్ లు,ఆ గ్రూప్ లకు లీడర్ లుగా ఉండే పోకిరీలు ఇలా విడి విడిగా వారికి తన స్టైల్ లో కౌన్సిలింగ్ ఇవ్వడం, నేరగాళ్ళును స్టేషన్ కు తీసుకు వచ్చినప్పుడు పెద్దమనుషులు ముసుగులో,రాజకీయ నాయకులం అని చెప్పుకుంటూ స్టేషన్ కు వచ్చే వారికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా అనవసరంగా మర్యాదలు చేయకుండా ముక్తసరిగా ముక్కు సూటిగా మాట్లాడడం తో నేరస్తులకు వత్తాసుగా వేదాయపాలెం స్టేషన్ కు వెళ్ళాలి అంటే ఎంతటి వారైనా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితి తీసుకువచ్చారు.ఇదే సమయం లో న్యాయం వైపు గట్టిగా నిలబడుతూ పేదవరైనా,పలుకుబడి లేకున్నా అన్యాయం జరిగింది అని స్టేషన్ గడప తొక్కితే వారికి న్యాయం జరిగే వరకు గట్టిగా నిలబడడం తో రికమండేషన్ లకు ఎండ్ కార్డు నిజాయితీకి గ్రీన్ కార్పెట్ పరిచి ఓ పోలీసు అధికారి గట్టిగా పనిచేస్తే ఎంత దారుణ నేర పరిస్థితులైనా మార్చి వేయవచ్చు, ఎర్రగా రక్తం ఏరులై పారిన చోటే పచ్చటి పరిస్థితులు కల్పించవచ్చు. రక్త చరిత్ర నుండి శాంతియుత పరిస్థితి తీసుకు రావచ్చు అని నిరూపించిన CI శ్రీనివాసరావు రాష్ట్రం లోనే ఆదర్శవంతమైన పోలీసు అధికారి అని చెప్పడం లో ఎం మాత్రం సందేహం లేదు.ఓ కమ్మిని వంచాలి అంటే వూరికే వంగదు బాగా నిప్పుల కొలిమిలో కాల్చాలి,సమ్మిటి దెబ్బలు కొట్టాలి అప్పుడే మనం అనుకున్న విధంగా ఆ కమ్మి తయారౌతుంది.అలానే సమాజం లో నేరగాళ్ల లో మార్పు రావాలి అంటే పోలీసు కొంత కఠిన వైఖరి అమలుపరచ తప్పదు.ఈ కథనం లో CI శ్రీనివాసరావు పనితీరు గురించి చెప్పింది గోరంత చెప్పంది కొండంత.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular