పదవి బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ సురేష్
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ అంబేద్కర్ సంఘం నాయకులు
ఇల్లంతకుంట /ప్రజావాణి
ఇల్లంతకుంట మండలంలో విధులు నిర్వహించిన తాసిల్దార్ ఫారూక్ ముస్తాబాదుకు బదిలీపై వెళ్లగా కలెక్టర్ కార్యాలయం నుండి ఇల్లంతకుంట మండలానికి బదిలీపై వచ్చి నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన తాసిల్దార్ సురేష్ ను ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద రాజు గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించి పూల బొకే అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజా సేవలో విజయవంతంగా ముందుకు సాగాలని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల మన్నన్నాలు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు భూమయ్య
ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద రాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుండేటి రాజు , ఉపాధ్యక్షులు కాస్పాక సురేష్, నాయకులు దమ్మని మోహన్ , కొట్టేపెల్లి బాబు. తదితరులు పాల్గొన్నారు.

