📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పేటలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి నలుగురి అరెస్ట్

పేటలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి నలుగురి అరెస్ట్

📰 Generate e-Paper Clip

 

గుంటూరు జిల్లా ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్20) చిలకలూరిపేట పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ సమీపంలో గల సరళ నర్సింగ్ హోమ్ వీధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారంతో, సోమవారం సాయంత్రం అర్బన్ సి.ఐ పి.రమేష్ తన సిబ్బందితో కలిసి ఒక ఇంటిపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతో పాటు,విటుడు మరియు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి రూ.3,650 నగదు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular