📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakవసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో దామోదర్

వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో దామోదర్

📰 Generate e-Paper Clip

గిరిజన బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో దామోదర్

చిన్నశంకరంపేట,జూలై28,మన ప్రజావాణి: చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని ఎంపీడీవో దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్నటువంటి మూత్రశాలలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులు సూచించారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ ప్రకారం భోజనం విద్యార్థులకు ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. హాస్టల్లో నీటి వసుతులు మరియు ఇతర సౌకర్యాల గురించి వార్డిని అడిగి తెలుసుకున్నారు.హాస్టల్ పరిసర ప్రాంతాలలో నీరు ఎక్కడ నిల్వ లేకుండా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ అధికారులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular