📄 ePaper
Monday, April 20, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipet విద్యా సదస్సు ను విజయవంతం చేయండి - జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్..

 విద్యా సదస్సు ను విజయవంతం చేయండి – జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్ ఏప్రిల్ 20, ప్రజావాణి,

టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న ఉదయం 10 గంటలకు హైద్రాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర విద్యా సధస్సుకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ పిలుపునిచ్చారు. గజ్వెల్ లో సమీకృత కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర విద్యా సదస్సు గోడ పత్రిక, కరపత్రాలను జిల్లా ఉపాధ్యక్షులు పాపిరెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, విద్యాసాగర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సమాజ పరిస్థితులు, విద్యారంగ అభ్యున్నతి,అందరికి సమానమైన విద్యను అందించే కామన్ స్కూల్ సిస్టం, ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణం తదితర అంశాలు చర్చించడానికి రాష్ట్ర విద్యా సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు.  రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ , అతిథిగా తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం  హాజరుకానున్నారు . సదస్సులో “నూతన జాతీయ విద్యా విధానం రాజ్యాంగ విలువలు” అను అంశంపై ఏఐఎఫ్ఆర్టీఈ జాతీయ అధ్యక్ష వర్గ సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్  ,”తెలంగాణలో అసమాన విద్య విద్యారంగంలో సంక్షేమం”పై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతగింది కాశీం , “పశ్చిమాషియా యుద్ధం ప్రపంచ రాజకీయాలు” అను అంశంపై ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కే.శ్రీనివాస్, ప్రసంగించనున్నారని తెలిపారు.టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు కు ఉపాధ్యాయులు,విద్యాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో టిఫిటిఎఫ్ నాయకులు దయానంద్,శ్రీనివాస్ గౌడ్, అర్జున్, ఓటరికారి శ్రీనివాస్,ఆకుల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, మహిళా ఉపాధ్యాయులు స్వరూప, జగదాంబ, లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular