వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20)ఏప్రిల్ 26 నుంచి 28 వరకు తిరుపతిలో జరిగే ఏఐటియుసి 18 రాష్ట్ర మహాసభలును జయప్రదం చేయాలని ఏఐటీయూసీ బద్వేల్ ఏరియా ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్,అధ్యక్షులు సఫా కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పోరుమామిళ్ల ఏఐటియుసి మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్టిసి బస్టాండ్ ఆవరణ లో పోస్టల్ లో ఆవిష్కరణ చేసి,అనంతరం వారు మాట్లాడుతూ.1921 అక్టోబర్ 31న స్వాతంత్య్ర పోరాటం కార్మికులు హక్కుల నినాదంతో స్థాపించన ఏఐటియుసీ నేడు 106 సం భారతదేశంలోని ఏకైక తొలి ప్రధాన కేంద్ర కార్మిక సంఘంగా ఉందని అన్నారు.కార్మికుల హక్కులు,వేతనాలు,పని గంటలు,పని పరిస్థితుల మెరుగుదల,సామాజిక న్యాయం పెట్టుబడిదారీ దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు.కార్మిక హక్కుల రక్షణ,కనీస వేతనం,ఉద్యోగ భద్రత,సామాజిక భద్రతా పథకాల కోసం మరియు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళనలు,సమ్మెలు నిర్వహిస్తుందని అన్నారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికవర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు కాలరాస్తూ 44 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటిస్థానంలో 4 లేబర్ కోడ్లుగా మార్చి వేసిందని అన్నారు. కార్మికవర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్మిక హక్కులు యాజమాన్యాలుగానీ ప్రభుత్వాలుగానీ తమ దయాదాక్షిణ్యాలతో చేయి విదిలించిన సందర్భాలు లేవు. ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు,చట్టాలు పోరాడి సాధించుకున్నవే తప్ప బుర్జువా పాలకులు ఇష్టంతో ప్రసాదించినవి కాదని అన్నారు. అసంఘటిత రంగ ఆటో హమాలీ వీది విక్రయ దారులకు సమగ్ర సంక్షేమ చట్టాలు అమలు చేయాలని విజ్ఞప్తి ఆశ అంగన్వాడి,మధ్యాహ్న భోజనం,తదితర రంగాల స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని,వివిధ ప్రభుత్వ రంగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు స్కీం వర్కర్లకు కనీస వేతనం 26 వేలు రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేశవ,ఆర్గనైజేషన్ సెక్రటరీ పిడుగు పిరయ్య,కోశాధికారి జిఎల్ నరసింహ,ఆటో యూనియన్ నాయకులు అన్వర్,కాసిం,నరసింహులు,సుబ్బు,, ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు చాంద్ బాషా,నాయబ్,అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు
చలో తిరుపతి” గోడపత్రాలు ఆవిష్కరణ ఏఐటీయూసీ ఏఐటీయూసీ 18 వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేద్దాం
0
8
RELATED ARTICLES
- Advertisment -



