📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్దశాబ్దాల మహిళాల 33% రిజర్వేషన్ బిల్లు ఆగిపోవడం మహిళల ఆశలకు పెద్ద దెబ్బ: చిన్నపాక పద్మ...

దశాబ్దాల మహిళాల 33% రిజర్వేషన్ బిల్లు ఆగిపోవడం మహిళల ఆశలకు పెద్ద దెబ్బ: చిన్నపాక పద్మ శ్రీనివాస్ సూర్యప్రభ ఆగ్రో ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్,దళిత రత్న అవార్డు గ్రహీత 

📰 Generate e-Paper Clip

దేశంలోని మహిళలు ఎన్నో దశాబ్దాలుగా ఎదుగుతున్న మహిళల 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో మెజార్టీ ఓటింగ్ లేకుండా ఆగిపోవడం చాలా బాధాకరమని దళిత రత్న అవార్డు గ్రహీత సూర్య ప్రభ ఆగ్రో ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్నపాక పద్మ శ్రీనివాస్ అన్నారు మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు ఎంతో కీలకమైందని ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాకుండా మహిళా సాధికారతకు బలమైన అడుగని ఆమె పేర్కొన్నారు కానీ ఈ బిల్లు ను ముందుకు తీసుకురాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేయడం భారతీయ మహిళలపై జరుగుతున్న అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దేశ నిర్మాణంలో మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం సరైన ప్రాతినిధ్యం దక్కకపోవడం విచారకరమన్నారు మహిళల ఓట్లతో గెలిచే నాయకులు మహిళల హక్కుల విషయంలో మాత్రం మౌనం పాటించడం బాధాకరమని అన్నారు పార్లమెంట్లో ఈ బిల్లు ఆగిపోవడం అనేది కేవలం ఒక బిల్లు నిలిచిపోవడం కాదు కోట్లాది మహిళల ఆశలు నిలిచిపోవడమేనని దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ కుట్రల్లో భారతీయ మహిళను అలసిపోయేలా చేసి వెనక్కి నెట్టె ప్రయత్నం జరుగుతోందని ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థాలను పక్కనపెట్టి మహిళల హక్కులను గౌరవించి మహిళా రిజర్వేషన్ బిల్లును భవిష్యత్తులో అయినా ఆమోదించాలని మహిళల గౌరవం సమానత్వం నాయకత్వానికి ఇది చారిత్రాత్మక అవసరమని దళితరత్న అవార్డు గ్రహీత సూర్య ప్రభ ఆగ్రో ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్నపాక పద్మ శ్రీనివాస్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular