ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) విజయవాడ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ.భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారి ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలలో భాగంగా. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా BJP కార్యాలయం నుండి విజయ టాకీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు నిషిత రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షపార్టీలు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ మార్పుల బిల్లును వ్యతిరేకించడాన్ని తీవ్రవంగా తప్పుబట్టారు.మహిళలను వ్యతిరేకించిన పార్టీలు రానున్న రోజుల్లో కాలగర్బంలో కలిసిపోతాయని,మహిళల ఆగ్రహానికి గురికాకముందే కాంగ్రెస్ మరియు ప్రతిపక్షపార్టీలు తమ వైకరిని మార్చుకోవాలని,లేకపోతే మహిళల తరుపున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో బిజపి మహిళానాయకులు రాహుల్ గాంధీ ప్రతిమన తగలబెట్టి నిరసన తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు నిషిత రాజు , జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మావతి, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జిల్లా నాయకులు కార్యకర్తలు హాజరై నిరసన ర్యాలీని విజయవంతం చేసారు.
భారతీయజనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
0
4
- Advertisment -



