📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్24 గంటల్లోనే కిడ్నాప్ గురైన 10 నెలల బాలుడిని సురక్షితంగా తన తల్లికి అప్పగించిన కృష్ణా...

24 గంటల్లోనే కిడ్నాప్ గురైన 10 నెలల బాలుడిని సురక్షితంగా తన తల్లికి అప్పగించిన కృష్ణా జిల్లా పోలీసులు..జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

కృష్ణా జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) గన్నవరం సబ్ డివిజన్ పరిధిలోని పెనమలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన 10 నెలల బాలుడు కిడ్నాప్ కేసును కేవలం 24 గంటల్లోనే చేదించి, సురక్షితంగా కన్నతల్లి ఒడికి చేర్చి తల్లి కళ్ళల్లో ఆనందం నింపారు కృష్ణా జిల్లా పోలీసులు.ఈ కేసు కు సంబంధించిన పూర్వాపరాలను విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు. తెలియజేశారు.కిడ్నాప్ జరిగిందిలా..మాదాసు సుమమ్మ,w/o సమయ్య,వయస్సు 22 సాయిబాబా గుడి దగ్గర మంగళగిరి, గుంటూరు జిల్లా కు చెందిన మహిళ భిక్షాటన చేసుకోవడానికి విజయవాడ, ఆటోనగర్ UC టీ స్టాల్ వద్దకు రాగా అక్కడ గుర్తు తెలియని ముగ్గురు మహిళలు, ఇద్దరు మగ వ్యక్తులు సుమారు 11:30 గంటల సమయంలో ఆమె వద్దకు వచ్చి వారి వద్ద పాత బట్టలు ఉన్నాయని, వారితో వస్తే ఇస్తామని చెప్పి ఆటోలో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. కంకిపాడు ఫ్లైఓవర్ వద్ద కాలకృత్యాలు కి వెళ్దామని సుమమ్మ కి మాయ మాటలు చెప్పి ఆటోలో నుండి దింపి అక్కడే వదిలేసి ఆమెకు గల పది నెలల బాలుడు అయిన శివరామరాజు, s/o సమయ్య ని తీసుకొని ఆ 5 మంది వ్యక్తులు అక్కడి నుండి ఆటోలో పారిపోయారు.వెంటనే సుమమ్మ పెనమలూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా వెంటనే సదరు సంఘటనపై కేసు నమోదు చేశారు.సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ గారు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.దర్యాప్తు కొనసాగిందిలా.గన్నవరం DSP ధర్మేంద్ర గారి పర్యవేక్షణలో పెనమలూరు సిఐ జె.వి. రమణ నాయకత్వంలో పెనమలూరు మరియు కంకిపాడు సబ్ ఇన్స్పెక్టర్ లు మరియు సిబ్బంది కలిసి మొత్తం నాలుగు టీంలుగా ఏర్పడి, నిర్విరామంగా దర్యాప్తు చేసి CC camera ల ఫుటేజ్ సేకరణ, సాంకేతిక ఆధారాలు అనుమానితుల కదలికులపై నిఘా వంటి పలుకోణాల్లో సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ది 18.04.2026 వ తేదీ ఈ నేరంలో పాల్గొన్న ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది.ముద్దాయిల వివరాలు.1). గంజాల వెంకట నాగ శ్రీనివాసరావు S/o రామస్వామి, 42 సం.లు, ముదిరాజ్, ఇనకుదురు, మచిలీపట్నం.2) . షేక్ రెహన w/o గంజాల వెంకట నాగ శ్రీనివాసరావు S/o రామస్వామి, 42 సం.లు,ముదిరాజ్, ఇనకుదురు, మచిలీపట్నం.(పైన ఇద్దరు బాలుడిని కొనుక్కున్నవారు)3) . కొమిర కాలి S/o వెంకటేష్, 35 సం.లు, వడ్డెర, బ్లాక్ నం.58 VAMBAY colony, సింగ్ నగర్, విజయవాడ(ఆటో డ్రైవర్)స్వాధీనం చేసుకున్నది పోలీసులు ముగ్గురు ముద్దాయిలను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 5000/- రూపాయల నగదును, ఒక ఆటో స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ కేసులో పాల్పడిన నిందితులను అదుపులోనికి తీసుకొని పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నామని కిడ్నాప్ వెనుక ఉన్న ఉద్దేశాలు నిందితుల నెట్ వంటి పలు అంశాల్లో లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు.బాలుడు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని నిబంధనల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలుడిని వారికి అప్పగిస్తామని తెలిపారు.ఈ కేసును అత్యంత తక్కువ సమయంలోనే చేదించి బాలుడిని క్షేమంగా సంరక్షించిన పోలీస్ అధికారులను,సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.వారి అప్రమత్తత, సమర్థవంతమైన సమన్వయం,వేగవంతమైన చర్యలు ప్రశంసనీయమని, ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని ప్రజల భద్రతకు ఎలాంటి భంగం కలగనియమని ఎస్పీ గారు స్పష్టం చేశా

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.