📄 ePaper
Sunday, April 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జగనన్న గెలుపును ఎవరూ ఆపలేరు -పూజిత

జగనన్న గెలుపును ఎవరూ ఆపలేరు -పూజిత

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) సూళ్లూరుపేట నియోజకవర్గం,పెళ్లకూరు మండలం,చిల్లకూరు గ్రామంలో ఇటీవల ఆక్రమ కేసులో అరెస్టయిన నెల్లూరు జిల్లా మాజీ కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ధైర్యం చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత,కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను,రాజకీయ కక్షసాధింపు చర్యలను వైఎస్ఆర్ సీపీ దీటుగా ఎదుర్కొంటుంది.రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన నడుస్తోంది- వైఎస్ఆర్ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్ఆర్ సీపీ కేడర్ వెనకడుగు వేయదు,రాబోయే ఎన్నికల్లో జగనన్న ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు- కాకాణి పూజిత స్క్రోలింగ్ పాయింట్స్-సత్యనారాయణ రెడ్డి ఏ తప్పూ చెయ్యలేదు కాబట్టే,భయపడాల్సిన అవసరం లేకుండా,కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యంగా ఉన్నారు.జగనన్న బాట లో నడిచే వైఎస్ ఆర్ సీపీ శ్రేణులు అక్రమ కేసులకు,జైళ్లకు భయపడరు కూటమి నేతలు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలకు వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు అడ్డుకుంటూ ప్రశ్నించకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేసి పక్క రాష్ట్రాలకు అమ్మేసేవారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది,ప్రజలు జగనన్న పాలనను కోరుకుంటున్నారు.జగనన్న బాటలో నడిచే కార్యకర్తలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది.కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కక్షసాధింపు చర్యలు మరియు ప్రైవేటీకరణ ముసుగులో జరుగుతున్న ప్రజాధన దోపిడీ ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.సత్యనారాయణ రెడ్డి గారి పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం,దీనికి కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.కూటమి ప్రభుత్వం కావాలనే వైఎస్సార్‌సిపి నాయకులు కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది,అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రైవేటీకరణ పేరుతో ప్రజా ఆస్తులను టిడిపి నాయకులు అమ్ముకుంటున్నారు,దీనిని అడ్డుకునే ధైర్యం కేవలం వైఎస్సార్‌సిపి కార్యకర్తలకు మాత్రమే ఉంది.ఎన్ని కుతంత్రాలు చేసినా,కాలచక్రం తిరిగినప్పుడు కూటమి నేతలు చేసిన తప్పులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.ప్రజలకు మంచి చేస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది తప్ప,ఇటువంటి అరాచకాలతో కాదు. అక్రమ కేసులతో సత్యనారాయణన్నను భయపెట్టలేరు,మేమంతా ఆయనకు అండగా ఉన్నాము,కోర్టులో న్యాయమే గెలుస్తుంది,త్వరలోనే బెయిల్ పై వస్తారు.అధికారంలో ఉన్నా లేకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో దేవుడిలా కొలువై ఉన్నారు.జగనన్న చేసిన మంచి పనులు,జగనన్న మనకు తోడు ఉన్నాడనే దైర్యం తో ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ముందుకు సాగుతున్నాం.రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి టిడిపి కార్యకర్తలే ఆందోళన చెందుతున్నారు.2029లో మళ్ళీ వైఎస్సార్‌సిపి అధికారంలోకి రావడం, జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular