కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18)బద్వేల్ 13వ ఏరియా మహాసభ ఏఐటీయూసీ మాజీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్ జెండా ఎగరవేయడం జరిగింది.అనంతరం ఏఐటియుసి ఏరియా కార్యదర్శి పివి రమణ అధ్యక్షతన సమావేశం ప్రారంభించుకొని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాదుల్లా, వేణుగోపాల్ మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆవిర్భవించి 106 సంవత్సరాలు కార్మికుల కోసం,కష్టజీవుల కోసం, కార్మికుల హక్కుల కోసం,పని గంటల కోసం, అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా సమస్యలతో ఎదుర్కొంటున్నారని,కానీ ఇప్పటి వరకు సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.2014-19 కాలంలో ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను 50 శాతం పెంచి ఆదుకున్న చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని అదే విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కోరారు.ప్రస్తుతం అమల్లో ఉన్న ఆప్కాస్ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసి ఉద్యోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.గత జగన్ ప్రభుత్వ హయాంలో 11వ పిఆర్సి కమిటీ సీఎస్ కమిటీలు 30 శాతం వేతనాలు పెంచాలని సిఫారసు చేసినా,కేవలం 23 శాతం మాత్రమే పెంచడం అన్యాయం చేశారని గుర్తు చేశారు.హెచ్ఆర్ పాలసీ అవసరం మెప్మా,స్పెర్స్ ఉద్యోగులకు మాదిరిగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేసి,ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పూర్తి కాలం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటివరకు సర్వీస్ రూల్స్ లేకపోవడం అన్యాయమని దురదృష్టకరమని,వీలైనంత త్వరగా నియమ నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇంక్రిమెంట్లు, సంక్షేమ పథకాలు 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న సీనియర్లకు,కొత్తగా చేరిన వారికి ఒకే విధమైన జీతాలు ఇవ్వడం అన్యాయం అని, సీనియార్టీ ఆధారంగా ఇంక్రిమెంట్లు కల్పించాలని వారు కోరారు.అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేసి,వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ బాలు,సిపిఐ ఏరియా కార్యదర్శి మస్తాన్ రూరల్ కార్యదర్శి ఇమ్మానియేల్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు వెంకటరమణ ఏఐటియుసి నాయకులు జియల్ నరసింహ నాగేష్ పేరయ్య సఫా గురయ్యా నరసింహులు ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగేశ్వరి లక్ష్మీదేవి ఆటో యూనియన్ నాయకులు చిన్న మురళి మినీ లారీ వర్కర్స్ యూనియన్ నాయకులు రవీంద్ర భాష మహిళా సంఘం సిపిఐ నాయకురాలు రవికుమార్,కోడూరు కేశవ,విజయమ్మ,సునీల్,సన్నమాల చెన్నయ్య,షాహీదా,గూడూరు పెంచలయ్య,,తదితర కార్మిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఘనంగా ఏఐటీయూసీ బద్వేల్ ఏరియా 13వ మహాసభ కార్మికుల కడుపు కొట్టే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ.. డిమాండ్
0
17
RELATED ARTICLES




