కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) పోరుమామిళ్ల-కూలీలమైన మేము రక్తాన్నిచెమటగా మార్చి కష్టిం చిచేసిన పనికి రావాల్సిన కూలి డబ్బులు వారాల తరబడి రాకపోవడంతో వారి కుటుంబపరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి.కడపజిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్ర0 గ్రామపంచాయతీలో జాతీయగ్రామీణఉపాధి హామీపథకం పనులకెళ్లిన కూలీలకు నెలల తరబడి డబ్బులు ఉపాధిఅధికారులు చెల్లించకపోవ డంతో పూట గడవాలంటే ఇబ్బందికర పరిస్థితులునెలకొన్నాయి.ఈనెల 9వతేది నుండి 15 వ తేదీ వరకు పనులనుజాబ్ కార్డు నెంబర్10046 ఇండ్లరవణమ్మ,జాబ్ కార్డు నెంబర్10046 ఇండ్లరామిరెడ్డి,జాబ్ కార్డు నెంబర్10107 ఇండ్లచెన్నారెడ్డి,మరి కొంతమంది జాతీయగ్రామీణ ఉపాదిపనులు చేశారు.అయితేఏపీఓ రవీంద్రారెడ్డి మాత్రం మాపై కక్ష్య సాధింపునకు దిగి మామస్టర్ బిల్లులు చేయకుండా పక్కన పెట్టినట్లువారు మండిపడ్డారు.
రంగసముద్రం గ్రామపంచాయతీకి దస్తగిరమ్మ,రవి కుమార్ ఇద్దరు పీల్డ్ అసిస్టెంట్లుఉన్నారు. వీరు వారి కులాలవారికి మాత్రమే పనులు కల్పిస్తూమాకుఅన్యాయం చేస్తున్నారనివారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మహబూబ్ నగర్, రంగసముద్రంకు చెందిన బిసి లు సుమారు 70 మంది పనులకు అలా రావడం ఇలా ఫొటోలు తీసుకొని దాదాపు35 మంది ఇంటికెళ్తున్నారు.వీరంద రికి పీల్డ్ అసిస్టెంట్ దస్తగిరమ్మమస్టర్ వేస్తున్నారు.పనులదగ్గర దస్తగిరమ్మ ఉండదని ఆమెభర్త కలసపాడు మండలం చింతలపల్లెకు చెందిననారాయణస్వామి చేయించడం చేస్తున్నారు. భార్య స్థానంలో భర్త పనులు చేయించవచ్చా అని వారు వాపోతున్నారు. వీరినిఏపీఓరవీంద్రారెడ్డి.ఎలా అనుమ తిఇస్తున్నారన్నారని ప్రశ్నించారు.పీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ కూడా వారికుల వర్గాలకే పనులు కల్పిస్తున్నారన్నారు.ఏపీఓఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ 2022-23సంవత్సరం రంగసముద్రం పొలం సర్వేనెంబర్227లోచెరువుతొట్టి అలుగు పోరంబోకు లో,సర్వే నెంబర్ 228లోఉపాధి హామీపథకం ద్వారా బోయిళ్ళసుబ్బరాయుడు అనువ్యక్తికి మామిడిచెట్లు నాటించి బిల్లులుకూడా ఏపీఓచెల్లిం చారన్నారు.ప్రభుత్వ భూమి చెరువు తొట్టి పోరంబోకులో ఇతరులకు ఏవిదంగా మామిడిచెట్లునాటించారు,ఎవరుఅనుమతిం చారనిమండిపడ్డారు.
నరసింగుపల్లి కు చెందినసర్వేనెంబర్.194లోజక్కుల లక్ష్మీదేవికి,జక్కుల అంకమ్మ,సర్వేనెంబర్ 474 లోజక్కుల రాములు కు మామిడి చెట్లు నాటినఇంతవరకు ఎపిఓ బిల్లులు చెల్లించలేదన్నారు.ఉపాధి పనులు పెట్టడంలేదు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను మాకు పెట్టమని మస్టర్లను పట్టుకొని పీల్డ్ అసిస్టెంట్ లను బ్రతిమా లినా కనీసం ఫొటోలుతీ సేందుకు కూడా రావడంలేదని ఇండ్లరామిరెడ్డి,మెకానికల్ చెన్నారెడ్డి లు మండిపడ్డారు.భాద్యత లేని వీరిని సస్పెండ్ చేయా లని,లేకుంటే మాకు కూడా పీల్డ్ అసిస్టెంట్ ను నియమించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
సారూ… మాకూలి డబ్బులేవి.రెక్కాడితేగాని..డొక్కనిండని..నిరుపేద కూలీలo
RELATED ARTICLES




