📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి – తహసీల్దార్‌కు వినతి

ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి – తహసీల్దార్‌కు వినతి

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఏప్రిల్ 17 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఉపాధ్యాయులు,ఉద్యోగ సంఘాల నాయకులు తహసీల్దార్ శ్రీకాంత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్‌సీ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డుల జారీ, ఓపీఎస్ పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లను అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని తమ సమస్యలను తహసీల్దార్‌కు వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular