ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16)నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో మట్టి మాఫియా.గుట్టలను మాయం చేస్తోంది!అక్రమంగా సాగుతున్న తవ్వకాలు.చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూశాఖ,మైనింగ్ శాఖ.అటవీ భూమిలో మట్టి అక్రమ రవాణా వదలని దళారులు.నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో మట్టి మాఫియా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారి ఆగడాలు‘మూడు ట్రాక్టర్లు.ఆరు టిప్పర్లు’ అన్న చందంగా మట్టి అక్రమ దందా పెద్ద ఎత్తున సాగుతోంది.ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ శాఖ అధికారులు,మైనింగ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు..అటవీ భూమిలో మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. జేసీబీలతో ట్రాక్టర్లలో మట్టిని నింపి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి అక్రమార్కులు సొమ్మచేసుకుంటున్నారు.ఈ మట్టి అక్రమ రవాణాను అరికట్టే బాధ్యత ఎవరిది.మైనింగ్ శాఖదా.రెవెన్యూ శాఖ దా.ఈ మట్టి మాఫియా ఇంతగా చెలరేగుతుంటే మైనింగ్ వాళ్లు ఏం చేస్తున్నారని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.రాత్రిపూట అధికలోడ్తో వెళ్తున్న టాక్టర్ ర్లతో తమ రోడ్లు దెబ్బతినడమే కాకుండా రాత్రిళ్లు ఆ శబ్ధాలతో నిద్రలేకుండా చేస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పచ్చగా ఉన్న అటవీ భూములను సైతం జేసీబీతో ధ్వంసం చేస్తూ అడవులను అంతరించేలా చేస్తున్నా.ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం ఇప్పటికై నా అధికారులు సమన్వయంతో పని చేసి మట్టి అక్రమ రవాణా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Homeఆంధ్రప్రదేశ్మట్టి మాఫియా.. గుట్టలను మాయం చేస్తోంది!!అక్రమంగా సాగుతున్న తవ్వకాలు..చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూశాఖ,
మట్టి మాఫియా.. గుట్టలను మాయం చేస్తోంది!!అక్రమంగా సాగుతున్న తవ్వకాలు..చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూశాఖ,
0
8
Next article
- Advertisment -
