సిద్దిపేట్, ఏప్రిల్ 15, ప్రజావాణి
దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో జరిగిన ఒక హత్య కేసులో నిందితులకు సిద్దిపేట జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు బుధవారం కఠిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. నేరం నిరూపితమైన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సాయి రామదేవి *నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ. 6,000- జరిమానా* విధిస్తూ తీర్పునిచ్చారు. *కేసు వివరాలు:*దుబ్బక పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో జరిగిన ఘర్షణలో హత్యకు సంబంధించి కేసునమోదైంది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం, నిందితులు చట్టవిరుద్ధంగా గుంపుగా చేరి హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. *శిక్ష పడ్డ నిందితుల వివరాలు :1. కడవేర్గు శ్రీనివాస్: తండ్రి ఉప్పలయ్య, వయస్సు 45 సం||, బీడీ కార్మికుడు, దుబ్బక2. సూరం బాలరాజు తండ్రి నాగయ్య, డ్రైవర్, దుబ్బక్క.3. కడవేర్గు మల్లేశం తండ్రి ఉప్పలయ్య, వయస్సు 48 సం||, హోటల్ వ్యాపారం, దుబ్బక4. కడవేర్గు సుజాత భర్త శ్రీనివాస్, వయస్సు 35 సం||, కూలీ, దుబ్బకఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె. జీవన్ రెడ్డి, వెంకట లింగం,బలమైనసాక్ష్యాధారాలనుకోర్టుముందుప్రవేశపెట్టారు. కేసు దర్యాప్తు అధికారి మరియు దుబ్బక సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆర్. నిరంజన్, శాస్త్రీయ ఆధారాలను సేకరించి నిందితులకు శిక్ష పడేలా కృషి చేశారు. ప్రస్తుత దుబ్బక సి.ఐ టి. రాజేష్, ఎస్.ఐ కె. కీర్తి రాజు, సి.డి.ఓ కె. అంజి రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ డి. శ్రీనివాస్ రెడ్డి కేసు ఫాలోఅప్లో కీలక పాత్రపోషించారు.బాధితులకు న్యాయం చేకూర్చేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని న్యాయవాదులను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ అభినందించారు.




