📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్‌కేసర్‌లో ఫుట్‌పాత్ అక్రమణల తొలగింపు

ఘట్‌కేసర్‌లో ఫుట్‌పాత్ అక్రమణల తొలగింపు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఏప్రిల్ 15: ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నారపల్లి మజీద్ నుండి ఎం.జి.ఆర్ షాపింగ్ మాల్ వరకు ఉన్న జాతీయ రహదారి ప్రధాన రహదారికి ఇరువైపుల ఫుట్‌పాత్‌లపై జరిగిన అక్రమణలను బుధవారం తొలగించారు. ఫుట్‌పాత్‌లపై తిరిగి అక్రమణలు చేసినా లేదా పాదచారులకు ఆటంకాలు కలిగించినా సంబంధిత షాపు యజమానులపై జరిమానాలు విధించబడతాయని అధికారులు హెచ్చరించారు. అలాగే, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఇతర ప్రధాన రహదారుల వద్ద ఉన్న వ్యాపారులు ముందుగానే స్వచ్ఛందంగా అక్రమణలను తొలగించుకోవాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఎ. వాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో టి పి ఓ బై/ ఏ సీ పి శ్రీ రాజీవ్ రెడ్డి, స్థానిక ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పోలీసులు మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.