📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialఅంబేద్కర్ ఆలోచనలతోనే అన్ని వర్గాలకు న్యాయం**అందరికీ స్ఫూర్తి అంబేద్కర్* *రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన...

అంబేద్కర్ ఆలోచనలతోనే అన్ని వర్గాలకు న్యాయం*

*అందరికీ స్ఫూర్తి అంబేద్కర్*

*రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి*

📰 Generate e-Paper Clip

*అంబేద్కర్ ఆలోచనలతోనే అన్ని వర్గాలకు న్యాయం*

*అందరికీ స్ఫూర్తి అంబేద్కర్*

*రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి*

* (మన ప్రజావాణి) మందమర్రి:-ఏప్రిల్ 14:

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన వల్ల అన్ని వర్గాలకు న్యాయం చెందేలా, ఎక్కడైతే అణగారిన వర్గాలు అణిచివేతకు గురవుతారో, వారికి హక్కులు ఉన్నాయని రాజ్యాంగంలో పొందుపరచిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టణంలో అంబేద్కర్ యువజన సంఘం  ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్ సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, సింగరేణి ఏరియా జిఎం ఎన్  రాధాకృష్ణ తో కలిసి హాజరయ్యారు.  ముందుగా పంచశీల పథకాన్ని ఆవిష్కరించి, అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,  అందరికీ అంబేద్కర్ ఒక స్ఫూర్తి అని తెలిపారు. చిన్నతనంలోనే ఆయనను పాఠశాల నుండి వెలి వేయగా, కుల వివక్షత గురైన అంబేద్కర్ కృషి, పట్టుదలతో చదివి, ఆ రోజుల్లోనే 23 డిగ్రీ లు పూర్తి చేయడం మామూలు విషయం కాదన్నారు. దేశం నుండి లండన్ లో ఎకనామిక్స్ లో అంబేద్కర్ ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తాను పెద్దపెద్ద  విద్యాసంస్థలలో చదివి డిగ్రీ సంపాదించానని, అంబేద్కర్ ఆలోచన విధానం వల్లే తాను  ఎంపీ, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నానని తెలిపారు.చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన దేశం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని, దాని ఆధారంగానే మనం ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. కేంద్ర కార్మిక మంత్రిగా అంబేద్కర్ ఉన్నప్పుడు నూతన చట్టాలు తీసుకువచ్చి, కార్మికులకు ఎనిమిది గంటల పని వేళలు, భీమా సదుపాయాలు కల్పించి, కార్మికులకు సేవలు అందించారని అన్నారు. తన తండ్రి కాకా వెంకటస్వామి అంబేద్కర్ అడుగుజాడల్లో  పయనిస్తూ, ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు  నష్టాల్లో ఉన్న సింగరేణిని రక్షించి, లక్ష మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారని గుర్తు చేశారు. అదేవిధంగా అంబేద్కర్ స్ఫూర్తితోనే కార్మికులు పెన్షన్ పథకం, ప్రావిడెంట్ ఫండ్ తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ చదువుకోవాలని సంకల్పంతో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేట్ పాఠశాలలు స్థాపిస్తున్నారని, బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలకు 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు. విద్యారంగంలో 50 వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ అంటే ఒక విప్లవం అని, ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మందమర్రి సిఐ పర్సా రమేష్, పట్టణ ఎస్ఐ గోపతి నరేష్, రామకృష్ణాపుర్ ఎస్ఐ జె శ్రీధర్ ల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్, పట్టణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, రాజకీయ, కుల, ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, స్వచ్ఛంద సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.