📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్తవణంపల్లి మండల దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135...

తవణంపల్లి మండల దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి  వేడుకలు.

📰 Generate e-Paper Clip

తవణంపల్లి మండల దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి  వేడుకలు.

తవణంపల్లి ఏప్రిల్ 14 ప్రజావాణి : తవణంపల్లి మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో  డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని, తవణంపల్లి మండల జడ్పిటిసి భారతి మధు కుమార్, అలాగే దళిత నాయకులు సుమారు 500 మంది దళితులు పెద్ద ఎత్తున పాల్గొని టీ. పుత్తూరు రోడ్డు నుండి అతి భారీ గజమాలతో, డప్పు వాయిద్యాలతో, ఉత్సాహంగా అంబేద్కర్ నినాదాలతో, టపాకాయలు పేలుస్తూ, ర్యాలీగా వచ్చి డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి బారి కేక్ కట్ చేసి, అంబేద్కర్ జోహార్ అనే నినాదాలతో నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధుకుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఈ సందర్భంగా కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎంపీపీ సీనియర్ దళిత నాయకులు రవిప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో, అంబేద్కర్ పాత్ర కీలకమని ఆయన అందించిన రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులను, స్వేచ్ఛను ప్రసాదించిందని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆయన జయంతిని సామాజిక న్యాయ దినోత్సవం గా జరుపుకుంటున్నారని తెలియజేశారు. అనంతరం లీగల్ అడ్వైజర్  విద్యావేత్త అయిన డా.మధు కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారని తల్లిదండ్రులు రాంజీ మకోజీ సక్పాల్,  భీమరాయ్, ఆయన దళిత కుటుంబంలో పుట్టారని చిన్నప్పటి నుంచే కుల వివచ్చను ఎదుర్కొన్నారని ఈ అనుభవాలే ఆయనను మార్పు కోసం పోరాడేలే చేశాయని చదువు ద్వారానే జీవితాన్ని మార్చుకోవచ్చని నమ్మి కష్టపడి చదివారని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారని, తెలిపారు. లండన్ లో ఆర్థిక శాస్త్రంలో పి హెచ్ డి పూర్తి చేశారని విదేశాల్లో చదివి తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా ఆయనకు వివక్ష ఎదురైందని  కానీ ఆయన వెనక్కి తగ్గలేదని తెలిపారు. విద్య ద్వారా దళితులు ఎదగాలనే ఆయన నమ్మకం. అందుకే ఆయన ఎప్పుడు చదువు.. పోరాడు.. సాధించు.. అనే సందేశం ఇచ్చారని, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, అనే విలువలను రాజ్యాంగంలో చేర్చాలని ఈ రాజ్యాంగం వల్లే రిజర్వేషన్లు హక్కులు అందరికీ లభించాలని ఈ సందర్భంగా తెలిపారు. కుల వ్యవస్థ అంటరానితనం వంటి సమస్యలపై ఆయన తీవ్రంగా పోరాడారని, ఆయన కృషి వల్లే అంటరానితనం చట్టపరంగా నిషేధించబడిందని, దళితులకు ఆత్మవిశ్వాసం కలిగించారని, భారతదేశపు మొదటి న్యాయ శాఖ మంత్రిగా రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారని అంబేద్కర్ గారి జీవితమంతా పోరాటమేనని కుల వివేక్షణ తొలగించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేదలు, బలహీన వర్గాల కోసం, నిరంతరం పోరాడని కొనియాడారు. ప్రతి ఏడాది   దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారని, ఇది ఒక సందేశం, సమానత్వం కోసం, న్యాయం కోసం, పోరాడాలని గుర్తుచేసే రోజు అని, దళితులకు ఇది ఒక గౌరవ దినం, భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలని ఎంత గొప్ప విషయమని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారని కానీ ఆయన ఆలోచనలు ఆశయాలు ఇప్పటికీ జీవిస్తున్నాయని, ఆయన జీవితం మనకు గొప్ప పాఠం, ఎంత కష్ట వచ్చినా చదువు పట్టుదలతో ఎదగాలి. సమాజంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు కాదు ఆయన ఒక మార్గదర్శి, ఆయన చూపిన మార్గంలో నడిస్తే మన సమాజం మరింత మంచిగా మారుతుందని అందుకే అంబేద్కర్ జయంతి రోజున మాత్రమే కాదు ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను పాటించడం మనందరి బాధ్యతని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం మాజీ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డేవిడ్ మాట్లాడుతూ దళితులు ఎక్కడున్నా ఐక్యమత్తంగా కలిసిమెలిసి అంబేద్కర్ కల్పించిన హక్కులను పొందుకోవాలని తెలిపారు. అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ షణ్ముగం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడంలో దళితులు ముందుండాలని, ఆయన చూపిన మార్గాలను నేటి భావితరాలకు అందించాలని, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఉపయోగించుకుంటూ దళితులు ఆర్థికంగా ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు జగపతి, అంబేద్కర్ కమిటీ గౌరవ అధ్యక్షులు మురుగన్, సెక్రటరీ ఎకరాజ్, ఉపాధ్యక్షులు చిన్నయ్య, రీటాబాబు, మురుగేషన్, మరియు చిట్టిబాబు, మాజీ సర్పంచ్ పుణ్యసముద్రం కుమార్, జయ కుమార్, అనంత కుమార్, పైమాగం ప్రశాంత్, గోవిందు, వెంకటేష్, చలపతి, మణిరాజ్, గంగయ్య, జగదీష్, నీలకంఠం, సుగుణ, తదితరులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.