📄 ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగాగిల్లాపూర్ గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

గాగిల్లాపూర్ గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి,ఏప్రిల్ 14(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ ఎర్రల జానకి-రాజు, ఉపసర్పంచ్ చింతలపల్లి పద్మ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషిని గుర్తుచేస్తూ నాయకులు ప్రసంగించారు.
గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పామూరు రాజేంద్రప్రసాద్, గ్రామ పోలీస్ సాయి, వార్డు సభ్యులు కల్ల పెళ్లి లక్ష్మి, తడకపెల్లి పవన్, పైడిపల్లి శంకర్, సి.ఏ. మంజుల, ఆశా వర్కర్ తృతీయవర్ణ, మాజీ సర్పంచ్ మాసం శ్రీనివాస్, పులి శ్రీనివాస్, భావండ్ల జ్యోతి, భావనల తిరుమల, అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular