పోచమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠకు విశ్వబ్రాహ్మణ సంఘం విరాళం
బెజ్జంకి, ఏప్రిల్ 14(ప్రజావాణి }
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో నిర్వహించబడనున్న పోచమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున సర్పంచ్ ఎర్రల జానకి రాజు , ఉప సర్పంచ్ చింతపల్లి పద్మ కి రూ.10,000 విరాళాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పాల్గొని కార్యక్రమ విజయవంతానికి తమ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



