📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్రపతి ముర్మకు కృతజ్ఞతలు తెలియజేసిన, మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు,చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ...

రాష్ట్రపతి ముర్మకు కృతజ్ఞతలు తెలియజేసిన, మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు,చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,

📰 Generate e-Paper Clip

ఢిల్లీచిత్తూరు ప్రజావాణి న్యూస్(ఏప్రిల్13)అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లుకు ఆమోదముద్ర వేసినందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు,చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు,కూటమి ఎంపీల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో, రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అమరావతి విశిష్టతను వివరించే బుక్‌లెట్‌ను మంత్రి లోకేష్ సమర్పించారు.ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ..రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్ బాబు గారు, కూటమి ఎంపీల బృందం కలసి, అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో చివరి చట్టపరమైన అడుగుకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు చెప్పారు. రాష్ట్రపతి ముర్మును కలిసిన వారిలో కేంద్ర మంత్రి డి.శ్రీనివాస వర్మ గారు, పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము, సీఎం శ్రీ చంద్రబాబు గారి విజన్‌ను, రాజధాని అమరావతి కోసం భూములను ఇచ్చిన రైతులను (33 వేల ఎకరాలు) అభినందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్రపతి ముర్మును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు కోరినట్లు ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు గారు వెల్లడించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular