📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13) కలసపాడు పరిధిలో మూడు వేరు వేరు కేసుల్లో అక్రమంగా విక్రయిస్తున్న 26 క్వార్టర్ ల మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్.ఐ సుబహాన్ జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు మద్యం అక్రమ విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం శంఖవరం, సింగరాయ పల్లి, ఇ. రామాపురం గ్రామాల్లో దాడులు నిర్వహించి మూడు వేరు వేరు కేసుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మొత్తం ముగ్గురు వ్యక్తుల నుండి 26 క్వార్టర్ ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.ఐ సుబహాన్ తెలిపారు. అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ హెచ్చరించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular