📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగుగ్గిళ్ళలో బాలవికాస ఆధ్వర్యంలో జలదాన కార్యక్రమం

గుగ్గిళ్ళలో బాలవికాస ఆధ్వర్యంలో జలదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఏప్రిల్ 12(ప్రజావాణి )

సీద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలదాన- చలివేంద్రాన్ని దాతలు దూశెట్టి మహేందర్ రెడ్డి -వాసవి దాతల సహకారంతో జలదాన కార్యక్రమాన్ని గుగ్గిళ్ల  సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య,- ఉప సర్పంచ్ దుగ్యని లావణ్య, బాలవికాస సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ముందస్తుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన బాలవికాస సంస్థ ప్రతినిధులకు గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలవికాస సంస్థ ప్రతినిధులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular