📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetసీసీటివి కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు

సీసీటివి కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

సీసీ కెమెరాలు నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి

సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి

బెజ్జంకి, ఏప్రిల్ 11(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలంలోనీ స్థానిక సత్యార్జున హైటెక్ గార్డెన్‌లో సర్పంచులు, ఉప సర్పంచ్లతో కలసి పోలీసులు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పై ప్రత్యేక అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సిద్దిపేట డివిజన్ ఏసీపీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సిద్దిపేట సురక్ష నేత్ర” కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రధాన ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో భద్రత కూడా ముఖ్యమని, సర్పంచులు తమ గ్రామాల భద్రత కోసం ముందడుగు వేసి కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
సిసిటివి కెమెరాల వల్ల నేరాల నియంత్రణకు తోడ్పడటంతో పాటు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను, బెజ్జంకి ఎస్సై సౌజన్య, అలాగే మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, బెజ్జంకి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.