బెజ్జంకి,ఏప్రిల్ 11(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో రాష్ట్ర ఎస్సీ సెల్ చేర్మెన్,మానకొండూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ ముక్కిస కవితా- రత్నాకర్ రెడ్డి, బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి సిసి పనులనుప్రారంభించారు.గ్రామ సర్పంచ్,బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.బెజ్జంకి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్, బైరా సంతోష్, ఉపసర్పంచ్ గంగాధర హరీష్, వార్డు సభ్యులు పాకాల శ్రీనివాస్ రెడ్డి, అనుమాస సంధ్య, అనసూర్య, రాంరెడ్డి, రెడ్డి రామకృష్ణ రెడ్డి, చిలువేరు రాజిరెడ్డి, పల్లె రాజు రెడ్డి, లక్ష్మారెడ్డి, ముక్కెర కనకయ్య, కొమ్ముల రవి తదితరులు పాల్గొన్నారు.




