📄 ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetనేర నియంత్రణలో సీసీ కెమెరాల కీలక పాత్ర కీలకం బెజ్జంకి ఎస్సై సౌజన్య

నేర నియంత్రణలో సీసీ కెమెరాల కీలక పాత్ర కీలకం బెజ్జంకి ఎస్సై సౌజన్య

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఏప్రిల్ 11(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి దేవదాస్ తన దుకాణ సముదాయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాన రహదారిపై ఉన్న ఈ దుకాణంలో ఏర్పాటు చేసిన కెమెరాలను గమనించిన బెజ్జంకి ఎస్సై సౌజన్య ఆయనను అభినందించారు.ఈ సందర్భంగా ఎస్సై సౌజన్య మాట్లాడుతూ, నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. “ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని పేర్కొంటూ, ప్రజలు తమ భద్రత కోసం తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.భద్రతపై అవగాహన కలిగి వ్యవహరించిన దేవదాస్‌ను ఎస్సై సౌజన్య ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి హెడ్ కానిస్టేబుల్స్ సుధాకర్ రెడ్డి, జబ్బార్లల్,స్థానికులురావుల నర్సయ్య, లింగాల లక్ష్మన్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular