📄 ePaper
Friday, April 10, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఎస్సీ కార్యాచరణ ప్రణాళికా 2025-26 - పాడి గేదెల పంపిణీ పథకం దరఖాస్తు గడువు పొడగింపు...

ఎస్సీ కార్యాచరణ ప్రణాళికా 2025-26 – పాడి గేదెల పంపిణీ పథకం దరఖాస్తు గడువు పొడగింపు దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట్ ఏప్రిల్ 9 ప్రజావాణి

ఎస్సీ కార్యాచరణ ప్రణాళికా 2025-26 – పాడి గేదెల పంపిణీ పథకం దరఖాస్తు గడువు పొడగింపు దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ  కార్యాచరణ ప్రణాళికా 2025-26 ద్వారా సిద్దిపేట జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమలు చేస్తున్న పాడి గేదెల పంపిణీ పథకం దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు.ఈ మేరకు ఎస్సీ కార్పొరేష న్ ఈడీ బి .విజయ్ భార్గవ ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ-సేవ ద్వారా పొందిన ఆదాయ ధృవీకరణ పత్రం, పట్టాదారు పాస్ బుక్ , ఫోటోలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ జతపరచాల్సి ఉంటుంది. గేదెల పోషణకు కనీసం 10 గుంటల వ్యవసాయ భూమి ఉండాలని, ఒకవేళ భూమి లేని పక్షంలో గడ్డిని కొనుగోలు చేసి గేదెలను పోషించగల ఆసక్తి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా ఆన్ లైన్ దరఖాస్తు పూర్తి చేసి, దరఖాస్తు కాపీతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలని గ్రామీణ ప్రాంతాల వారైతే సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల వారైతే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు..

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular