📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నేరాల నియంత్రణలో సహకరించాలి''జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ. ఎస్

నేరాల నియంత్రణలో సహకరించాలి”జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ. ఎస్

📰 Generate e-Paper Clip

వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్09)నేరాల నియంత్రణలో సహకరించాలి,జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పట్టణం లోని బార్ లు వైన్ షాపుల నిర్వాహకులు తప్పనిసరిగా సి.సి కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి ప్రొద్దుటూరు ఎ.ఎస్.పీ శ్రీ విబు కృష్ణ ఐ.పి.ఎస్ గారి పర్యవేక్షణలో బార్ లు,వైన్ షాపుల లో పోలీసుల తనిఖీలు.నిర్వాహకులకు సూచనలు నేరాల నియంత్రణలో బార్లు,వైన్ షాపుల పాత్ర కీలకమని,నేరాల నియంత్రణకు వారంతా సహకరించాలని ప్రొద్దుటూరు ఎ.ఎస్.పీ శ్రీ విబు కృష్ణ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారి ఆదేశాల మేరకు గురువారం ప్రొద్దుటూరు ఎ.ఎస్.పీ శ్రీ విబు కృష్ణ ఐ.పి.ఎస్ గారి పర్యవేక్షణలో ప్రొద్దుటూరు త్రీ టౌన్ పరిధిలోని బార్లు, వైన్ షాపులలో ప్రొద్దుటూరు త్రీ టౌన్ సి.ఐ రామాంజనేయుడు,ఎస్.ఐ మైనుద్దీన్,సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సి.సి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఏ.పీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా సి.సి కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని నిరంతరం పని చేసేలా,వీడియో బ్యాకప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని బార్లు, వైన్ షాపుల నిర్వాహకులకు సూచించారు. బార్లు, వైన్ షాపులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని, వాటి ప్రాంగణంలో జరిగే నేరాల సమాచారాన్ని వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారమివ్వాలని ప్రొద్దుటూరు ఎ.ఎస్.పీ శ్రీ విబు కృష్ణ ఐ.పి.ఎస్ తెలిపారు. రౌడీ,సస్పెక్ట్ షీటర్లు వచ్చినపుడు కూడా పోలీసులకు సమాచారమివ్వాలని నిర్వాహకులకు ప్రొద్దుటూరు త్రీ టౌన్ సి.ఐ రామాంజనేయుడు సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, కడప

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.