సిద్దిపేట్, దుబ్బాక, ఏప్రిల్ 8, ప్రజావాణి
సిద్దిపేట కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందం అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. విశ్వసనీయ సమాచారం మేరకు దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పనపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, దుబ్బాక పోలీస్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 26.09 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి దుబ్బాక పోలీస్
స్వాధీనం చేసుకున్నారు.అప్పనపల్లి గ్రామానికి చెందిన మెరుగు సత్యనారాయణ (48), తండ్రి: బాలగౌడ్ అక్రమంగా తన నివాసంలోనే మద్యం విక్రయించడంతో పాటు సిట్టింగ్ నిర్మిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దుబ్బాక ఎస్ ఐ కీర్తిరాజు తెలియజేశారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా దుబ్బాక ఎస్ ఐ కీర్తిరాజు హెచ్చరించారు.




