దుబ్బాక పరిధిలోని అప్పనపల్లిలో బెల్ట్ షాపుపై దాడి – భారీగా మద్యం స్వాధీనం..

  సిద్దిపేట్, దుబ్బాక, ఏప్రిల్ 8, ప్రజావాణి సిద్దిపేట కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందం అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. విశ్వసనీయ సమాచారం మేరకు దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పనపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక బెల్ట్ షాపుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, దుబ్బాక పోలీస్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 26.09 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి దుబ్బాక పోలీస్ స్వాధీనం చేసుకున్నారు.అప్పనపల్లి గ్రామానికి చెందిన మెరుగు సత్యనారాయణ (48), తండ్రి: బాలగౌడ్ అక్రమంగా తన నివాసంలోనే మద్యం విక్రయించడంతో పాటు...