📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు

బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు

బెజ్జంకి, ఏప్రిల్ 8(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఏకశిలా కొండపై కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి.
జాతర బ్రహ్మోత్సవాలలో బహిరంగ వేలం టెండర్ల ద్వారా రూ. 11,98,500 వసూలయ్యాయి.హుండీ ద్వారా 6,80,853 రూపాయలు,మొత్తం కలిపి రూ. 18,79,383 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేసి ఆలయ అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జెల్లా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను విజయవంతం విజయవంతం చేసిన భక్తులకు అధికారులకు సిబ్బందికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మ దాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈవో శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఉప సర్పంచ్ మహేష్, పాలక మండలి సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచారి, జూనియర్ అసిస్టెంట్ సునీత,ఆలయ సిబ్బంది,పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.