📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఇంటి పన్ను సరే...అభివృద్ధి ఎక్కడా ..?. సిపిఐ

ఇంటి పన్ను సరే…అభివృద్ధి ఎక్కడా ..?. సిపిఐ

📰 Generate e-Paper Clip

కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్07)బద్వేల్ మున్సిపాల్టీలో పేదోన్ని భయబ్రాంతులకు గురిచేస్తు ఇంటి వసూళ్లు చేస్తున్నారు,కానీ అభివృ ద్ధి ఎక్కడ జరిగిందో అధికారులు సెలవివ్వాలని సీపీఐ జిల్లాకార్యవర్గ సభ్యులు వీరశేఖర్,ఏరియా కార్య దర్శి పిడుగు మస్తాన్,పెద్దులపల్లి బాలు మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు.బద్వేలు మున్సిపాలిటీ కార్యాలయంలో పేదలకు ఒకన్యాయం ,పెద్దలకు
ఒకన్యాయమని,ఇంటి పన్నులువసూళ్లలో చేతివాటం ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగా జిల్లా పార్టీ పిలుపుమేరకు మున్సిపల్ కార్యాలయం ముందు పెద్దులపల్లి బాలు, అధ్యక్షతన ధర్నా నిర్వ హించారు.ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో ఇంటి పన్నువసూలులో మున్సిపల్ అధికారుల ద్వంద వైఖరి పనికిమాలిన చర్యని లక్షల రూపాయలు పన్ను బకాయిలు కట్టాల్సిన పెద్దలను,,ప్రభుత్వకార్యాలయాలను వదిలేసి పేదలనుముక్కు పిండి వసూలు చేయడం సిగ్గు మాలిన చర్య అన్నారు.ఇది సరైన పద్ధతి కాదని,పేదలను పెద్దలను ఒకే రీతిగా చూడాలని పన్నులు వసూలు చేయడంలో పేదలు కొద్దిగా గడువు అడిగితేనే కొళాయి కట్చే చేయడం,ఇంటికి తాళాలువేయడం,అదే పెద్దలను పట్టించుకోకుండా ఏమాత్రం చర్యలు లేకుండామినహా యింపు ఇవ్వడం వెనక ఆంతరం ఏమిటని వారు ప్రశ్నించారు.బద్వేల్ పట్టణంలో సంవత్సరాల తరబడి భగత్ సింగ్ నగర్,సిఆర్ నగర్,ఎద్దుల ఈశ్వర్ రెడ్డినగర్ కానీ పేదలుప్రభుత్వస్థలంలో తమకుతాము గా ఇల్లు లేని నిరుపేదలు పునరా వాసం ఏర్పాటు చేసుకుని ఉంటే వారి ఇంటి పన్నులు కడతామన్నా రు.బద్వేల్ ఆదాయాన్నిపెంచుతా మని,బద్వేల్ అభివృద్ధికి తోడ్పడ తామని మహాప్రభువు అంటున్న వారియొక్కబాధలు పట్టించుకోకుండా వారికి ఇంటి పన్నులు వేయడం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు మేలు కొని పేదలను,పెద్దలను ఒకే రీతిలో చూడాలని అలా కాదుకూడదు అంటే మాత్రం బద్వేల్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వ ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి పివి రమణ.జిల్లా సమితి సభ్యులు పడిన వెంకటరమణ. పొంగూరు నాగరాజ్.పెంచలయ్య.పట్టణ నాయకులు నాగసుబ్బయ్య.సుబ్బయ్య.మహిళా నాయకులు తిరుమల. నవనీతమ్మ. లక్ష్మి.పెద్ద ఎత్తున పేదలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular