ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 06)కడప నగరంలోని నారాయణ సంస్థ లు ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా వేసవికాలం లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ఎన్జీవో కాలనీలో నందు ఉన్న నారాయణ విద్యాసంస్థసాయంత్రం దాకా పాఠశాలలో నడుపుతున్న నారాయణ విద్యాసంస్థలు అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్. వారి బృందం ఈ అనంతరం వారు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం వేసవికాలంలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఒంటిపూట బడులు మార్చి 15 నుండి అమలు కావడం జరిగింది. కానీ కడప నగరంలో ఇష్టానుసారంగా అధికారం అనే అన్నకు నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వానికి నిబంధనలకు వ్యతిరేకంగా సాయంత్రం దాకా పాఠశాలను నడుపుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు ఏమాత్రం ప్రభుత్వం ఇచ్చిన మాటలకి ఏమాత్రం లెక్కచేయకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారన్నారు. ఇలా ప్రతిరోజు వ్యతిరేకంగా నడుపుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న నారాయణ, చైతన్య,మరియు ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ధూమ్ చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఓంకార్, అఖిలేష్, కార్తీక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధలు పాటించని నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ
0
12
- Advertisment -



